News April 6, 2025

కొండపి: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో 52 సంవత్సరాల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు కొండేపి పోలీసులను ఆశ్రయించారు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకట కోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రైవేటు భాగాలను తాకుతూ ఉండటంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News April 10, 2025

ఆ ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది: ప్రకాశం జేసీ

image

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలుదారులకు అవసరమైన సూచనలు చేసేలా రూపొందించిన పోస్టర్లను బుధవారం ప్రకాశం భవనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, విజయకుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.

News April 9, 2025

దిశా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ

image

ఒంగోలులో ప్రకాశం భవన్‌లో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశానికి ఛైర్మన్‌గా ఎంపీ మాగుంట వ్యవహరించారు. దిశా కమిటీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ముందుకు నడిపించాలని ఆయన అన్నారు.

News April 9, 2025

ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి

image

ప్రకాశం జిల్లాలో వేరు వేరు ఘటనలలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం వల్లూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం, బైక్‌ను ఢీకొట్టడంతో వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టంగుటూరులోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అర్ధవీడులో మద్యం మత్తులో కన్న తండ్రి, కుమారుడిని కత్తితో పొడవటంతో తీవ్రగాయాలతో షాకీర్ మృతి చెందాడు.

error: Content is protected !!