News April 6, 2025
కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు.!

కృష్ణా జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గాయి. ఆదివారం జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో గత వారంలో కేజీ చికెన్ రూ.260లు ఉండగా, నేడు రూ.230కి తగ్గింది. పెద్దబాయిలేర్ రూ.230, చిన్న బాయిలర్ స్కిన్ లెస్ రూ.230, విత్ స్కిన్ రూ.220గా ఉన్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.
Similar News
News April 9, 2025
కృష్ణా: డిగ్రీ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి మే 2 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్ సైట్ చూడాలని కోరారు.
News April 9, 2025
గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి

గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ వద్ద పుల్లేరు వంతెనపై గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటే క్రమంలో మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చామన చాయ రంగు, మెరిసిన జుట్టు, కుంకుమ రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లూ నలుపు డిజైన్ లుంగీ ధరించినట్లు తెలిపారు.
News April 9, 2025
కృష్ణా: భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వండి- కలెక్టర్

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన కలెక్టర్ CSR నిధుల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు.