News April 6, 2025

చరిత్ర సృష్టించిన శాంసన్

image

IPL: నిన్న పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. షేన్ వార్న్‌ను వెనక్కినెట్టి RR మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచారు. మొత్తం 62 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయలేదు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్‌లోనే RRకు ట్రోఫీ అందించిన వార్న్ 55 మ్యాచ్‌ల్లో 31 విక్టరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

Similar News

News September 13, 2025

SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

image

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.

News September 13, 2025

ఇంగ్లండ్‌.. హయ్యెస్ట్ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్!

image

ఫార్మాట్ ఏదైనా అత్యధిక స్కోర్లు నమోదు చేయడం ఇంగ్లండ్‌కు చాలా మామూలు విషయం అని చెప్పవచ్చు. వన్డేల్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు (498/4 vs NED, 481/6 vs AUS, 444/3 vs PAK) ఆ జట్టు పేరిటే ఉంది. టెస్టుల్లో శ్రీలంక (952/6 vs IND) తర్వాత రెండో అత్యధిక స్కోర్ కూడా ENG పేరు మీదనే (903/7d vs AUS) నమోదైంది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ (304/2vsSA) చేసింది కూడా ఇంగ్లండే.

News September 13, 2025

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

image

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.