News April 6, 2025
బెల్లంపల్లిలో 9మంది జూదరులు అరెస్టు

పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్‌లో వెంకటేశ్‌కు చెందిన ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వెంకటేశ్, క్రాంతి కుమార్, రమేశ్, సురేశ్, మహేశ్, సుమన్, స్వామి, శ్రీనివాస్, మల్లాద్రిను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.12,500, 7ఫోన్లు, 5బైక్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.
Similar News
News April 9, 2025
TU: పరీక్ష ఫీజులకు ఈనెల 15 తుది గడువు

టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్‌ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.
News April 9, 2025
3 రోజులపాటు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.
News April 9, 2025
RBI వడ్డీ తగ్గించినా బ్యాంకులు తగ్గించట్లేదు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్న చందాన బ్యాంకుల తీరు తయారైంది. వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా చాలా బ్యాంకులు తగ్గించడం లేదు. దీంతో లోన్లు, EMIలు కట్టేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపై ఆధారపడి ఉండటమే వడ్డీ తగ్గకపోవడానికి కారణం. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. మీకూ ఇలా ఎప్పుడైనా జరిగిందా?