News April 6, 2025

విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే.! 

image

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.310 ఉండగా నేడు రూ.270గా ఉంది. అలాగే స్కిన్ రూ.260లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీకి రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.

Similar News

News April 9, 2025

BREAKING: తైవాన్‌లో భూకంపం

image

తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.

News April 9, 2025

పార్వతీపురం : కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రం

image

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 9, 2025

KNR పోలీసులు GREAT.. తండ్రి, పిల్లలను కాపాడారు!

image

కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న తండ్రిని కాపాడినట్లు కరీంనగర్ 2వ టౌన్ పోలీసులు తెలిపారు. విద్యానగర్‌కు చెందిన దశరథ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో మొబైల్ ఫోన్ ఆధారంగా ట్రై చేసి దశరథ్ అతని ఇద్దరి పిల్లలను క్షేమంగా అప్పజెప్పారు.

error: Content is protected !!