News April 6, 2025

NZB: చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

image

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్‌లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News April 9, 2025

TU: పరీక్ష ఫీజులకు ఈనెల 15 తుది గడువు

image

టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్‌ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.

News April 9, 2025

కారు బోల్తా.. TU విద్యార్థిని మృతి

image

KMR జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు HYD నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈఘటలో అంజలి పూజ మృతి చెందింది. అంజలి పూజ టీయూ సౌత్ క్యాంపస్‌లో చదువుకుంటోంది.

News April 9, 2025

NZB: చెరువులో పడి రైతు మృతి

image

ఇందల్వాయి మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు మృతి చెందాడు. గండితాండకు చెందిన విస్లావత్ నరేందర్ (43) రోజు మాదిరిగా తన పొలంలో ఉన్న గేదెలకు నీరు పట్టేందుకు సోమవారం రాత్రి వెళ్లాడు. అయితే పొలానికు వెళ్లే దారిలో గల చెరువులో ప్రమాదవశాత్తుపడి నీట మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మనోజ్ తెలిపారు.

error: Content is protected !!