News April 6, 2025

KMR: నీళ్లు దుర్వినియోగం.. మూడు కేసులు

image

మిషన్ భగీరథ నీళ్లు అక్రమంగా దారి మళ్లించి దుర్వినియోగపరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లని దారి మళ్లించి దుర్వినియోగం చేసిన ఇద్దరిపై లింగంపేట్ PSలో, పెద్ద కోడప్గల్ మండలం పోచారం తండాకు చెందిన మరో వ్యక్తి పై కేసు నమోదైనట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News April 9, 2025

నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

News April 9, 2025

తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

image

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. 

News April 9, 2025

త్వరలో ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్స్ మోత

image

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా త్వరలోనే టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. USకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు తప్పక ఉంటాయన్నారు. USలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావట్లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. IND సహా పలు దేశాలపై US ఇప్పటికే టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!