News April 6, 2025
‘జై శ్రీరాం’: నేడు హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్

శ్రీ రామ నవమి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభాయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్డీ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక అన్ని రామాలయాల్లో కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు ‘జై శ్రీరాం’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
Similar News
News October 24, 2025
HYD: CM సార్.. జర మా వైపు చూడండి!

పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ జీవి రోడ్డెక్కాల్సిందే. చలి, వాన, ఎండ ఎరుగరు. ఏం చేస్తా మరి.. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు. బల్దియా కార్మికుల బాధ ఇది. ‘లక్షలు జీతాలు తీసుకునే వారికే పండుగ బోనస్‌లు.. మా వైపు ఎవరు చూస్తారు సార్’ అంటూ ఓ కార్మికుడు Way2Newsతో వాపోయాడు. వాస్తవానికి సిటీని క్లీన్ చేయడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలకం. CM చొరవ చూపితే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు వేడుకుంటున్నారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 24, 2025
HYD: షాకింగ్.. 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ సూసైడ్

అబ్దుల్లాపూర్‌మెట్(మం) కోహెడలో మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. వీళ్లు 6th-10th కలిసి చదువుకున్నారు. గ్యార వైష్ణవి(18) మంగళవారం ఉరేసుకుంది. ఆమె క్లాస్మెట్ సతాలీ రాకేశ(21) ఇంటి సమీపంలో ఓ షెటర్లో బుధవారం ఉరేసుకున్నాడు. అదే ఊరిలోని బుద్ధ శ్రీజ(18) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.


