News April 6, 2025
ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో మండలానికి ఓ గ్రామం నుంచి మొత్తం 71 వేల మందిని ఎంపిక చేసింది. ఇప్పుడు మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం 4.50 లక్షల మందితో జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్‌లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News April 10, 2025
విచారణకు డుమ్మా కొట్టి.. సినీ ఈవెంట్‌కు హాజరైన దర్శన్

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం ఈ కేసుపై విచారణ జరగ్గా నడుంనొప్పి కారణంగా దర్శన్ కోర్టుకు హాజరుకావట్లేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కాగా ఇలాంటి సాకులు చెప్పొద్దని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొనడంతో తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News April 10, 2025
ట్రంప్ ఒక్క పోస్టుతో ఎగిసిన స్టాక్ మార్కెట్లు

ట్రంప్ పోస్టుతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. తన సోషల్ మీడియా ట్రూత్‌లో ‘కూల్‌గా ఉండండి, అంతా బాగా జరుగుతుంది, అమెరికా గతంకంటే బలంగా మారబోతుందని అని రాశారు. అనంతరం DJT కొనడానికి ఇదే సరైన సమయం’ అని పోస్ట్ చేశారు. దీంతో ట్రంప్ మీడియా స్టాక్ సంపద ( DJT) 22.7శాతం పెరిగి 415 మిలియన్ డాలర్ల సంపదను అర్జించింది. మెుత్తం స్టాక్ మార్కెట్‌కు ఒక్కరోజే 4ట్రిలియన్ డాలర్ల సంపద చేరింది.
News April 10, 2025
రాణా: వైద్యుడి నుంచి నరహంతకుడి వరకు..

26/11 కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ <<16048549>>రాణా<<>> ఇస్లామాబాద్ వాసి. కాలేజీ రోజుల్లో మరో కుట్రదారు డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. పాక్ ఆర్మీలో డాక్టరైన రాణా 1997లో మేజర్ హోదాలో రిటైరై కెనడా వెళ్లి ఆ దేశ పౌరుడిగా మారాడు. అనంతరం USAలో వీసా ఏజెన్సీ పెట్టగా హెడ్లీ ఈ దాడుల కోసం అతడిని కలిశాడు. దీంతో ముంబైలో రాణా వీసా ఏజెన్సీ తెరవడంతో హెడ్లీ ఆ వంకతో తరుచూ వచ్చి లొకేషన్లు రెక్కీ చేసి నరమేధ వ్యూహ రచన చేశాడు.