News April 6, 2025
శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని పనుల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడవాడలా వేడుకలు కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన రాముడి చరిత్రను గుర్తు చేసుకుందామన్నారు.
Similar News
News April 9, 2025
ఆదాయం పెంచేలా పని చేయండి.. CM ఆదేశం

AP: సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో తెలుసుకోవాలన్నారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని సూచించారు. నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్ అయిందని, అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.4,330 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
News April 9, 2025
కాకాణికి హైకోర్టులో షాక్

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.
News April 9, 2025
ALERT: కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

TG: రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.