News April 6, 2025
న్యూస్ రౌండప్

* AP: అనకాపల్లి ఫార్మా సిటీలో ప్రమాదం.. విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
* తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. స్వామిని దర్శించుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా
* TG: శ్రీశైలం SLBCలో 43 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ
* శ్రీరామనవమి వేళ అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీ
Similar News
News April 10, 2025
ఎల్లుండి వైన్ షాపులు బంద్

TG: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ నెల 12వ తేదీన వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి ఉంచాలని HYD సీపీ ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
News April 10, 2025
విచారణకు డుమ్మా కొట్టి.. సినీ ఈవెంట్‌కు హాజరైన దర్శన్

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం ఈ కేసుపై విచారణ జరగ్గా నడుంనొప్పి కారణంగా దర్శన్ కోర్టుకు హాజరుకావట్లేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కాగా ఇలాంటి సాకులు చెప్పొద్దని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొనడంతో తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News April 10, 2025
ట్రంప్ ఒక్క పోస్టుతో ఎగిసిన స్టాక్ మార్కెట్లు

ట్రంప్ పోస్టుతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. తన సోషల్ మీడియా ట్రూత్‌లో ‘కూల్‌గా ఉండండి, అంతా బాగా జరుగుతుంది, అమెరికా గతంకంటే బలంగా మారబోతుందని అని రాశారు. అనంతరం DJT కొనడానికి ఇదే సరైన సమయం’ అని పోస్ట్ చేశారు. దీంతో ట్రంప్ మీడియా స్టాక్ సంపద ( DJT) 22.7శాతం పెరిగి 415 మిలియన్ డాలర్ల సంపదను అర్జించింది. మెుత్తం స్టాక్ మార్కెట్‌కు ఒక్కరోజే 4ట్రిలియన్ డాలర్ల సంపద చేరింది.