News April 6, 2025
అమృతలూరు: విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

అమృతలూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాంబాబు(25) శనివారం రాత్రి ఇంటిలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. రాంబాబు రోజూ గుంటూరు పెయింటింగ్ పనికి వెళ్లి వస్తాడని, శనివారం ఇంటి దగ్గరే ఉండి కరెంట్ పనిచేస్తుండగా షాక్ కొట్టినట్లు తండ్రి సంసోను చెప్పారు. ఆ యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 9, 2025
భారత్‌కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు!

26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News April 9, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.
News April 9, 2025
నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.