News April 6, 2025
సీతంపేట: ఆటో బోల్తా.. ఒకరి మృతి

సీతంపేట పరిధిలో ఇసుకగెడ్డ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వెలగవాడకి చెందిన గొట్టపు లక్ష్మణరావు (36) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వలనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సీతంపేట ఎస్‌ఐ అన్నంరావు కేసు నమోదు చేశారు.
Similar News
News April 9, 2025
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
News April 9, 2025
త్వరలో ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్స్ మోత

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా త్వరలోనే టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. USకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు తప్పక ఉంటాయన్నారు. USలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావట్లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. IND సహా పలు దేశాలపై US ఇప్పటికే టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
News April 9, 2025
అమరావతి-HYD గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

AP: విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.