News April 6, 2025
కలిదిండి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 3న మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. మద్యం మానేయాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై 4వ తేదీన ఎలుకల మందుని నీళ్లలో కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News April 9, 2025
ఒంటిమిట్టలో కళ్యాణానికి 70 వేల లడ్డూలు సిద్ధం

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో (జనరల్) శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
News April 9, 2025
అక్రమ అరెస్టులు ఆపాలి: రవీంద్రనాథ్ రెడ్డి

వైసిపి నాయకుల, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్టు చేయటం దారుణం అన్నారు. చిన్న వివాదానికి సంబంధించి ఆయనని అరెస్టు చేయడం కక్ష సాధింపేనని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
News April 9, 2025
బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

మూడో తరగతి చదువుతున్న బాలికపై పక్క ఇంట్లో ఆర్ఎంపీ డాక్టర్‌గా ఉంటున్న యాళ్ల రత్న ప్రసాద్ (56) లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు అతనిని 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారు. ఈ ఘటన ఏలూరు రూరల్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకుని వెళ్లి తలుపులు వేసేసరికి చుట్టుపక్కల ఉన్నవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.