News April 6, 2025
HYD: హనుమంతుడు లేని రామాలయం!

అతి పురాతన ఆలయం మన HYD శివారులో ఒకటుంది. శంషాబాద్ మం. పరిధిలో 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఏకశిల రాతి విగ్రహాలు నెలకొల్పారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’అనే పేరు వచ్చిందని నానుడి. గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేని అరుదైన రామ మందిరం ఇది. ఇక్కడి నుంచే రాముడు ఒంటిమిట్టకు వెళ్లినట్లు పెద్దలు చెబుతారు.
Similar News
News April 9, 2025
కాకాణికి హైకోర్ట్‌లో ఎదురు దెబ్బ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ డిస్మిస్ చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పొదలకూరు పోలీసులు కాకాణిపైన కేసు నమోదు చేసిన విషయం విధితమే.
News April 9, 2025
ఒంటిమిట్టలో కళ్యాణానికి 70 వేల లడ్డూలు సిద్ధం

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో (జనరల్) శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
News April 9, 2025
అక్రమ అరెస్టులు ఆపాలి: రవీంద్రనాథ్ రెడ్డి

వైసిపి నాయకుల, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్టు చేయటం దారుణం అన్నారు. చిన్న వివాదానికి సంబంధించి ఆయనని అరెస్టు చేయడం కక్ష సాధింపేనని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.