News April 6, 2025
వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్‌లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
Similar News
News April 9, 2025
కోటబొమ్మాళి: ‘పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టండి’

పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదాను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళిలో పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్ ఆధునీకరించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
News April 9, 2025
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
News April 9, 2025
పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హుబ్లీ(UBL), కతిహార్(KIR) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం UBL- KIR(నెం.07325), ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం KIR- UBL(నెం.07326) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.