News April 6, 2025
విజయవాడ: రైలు ప్రయాణికులకు ముఖ్య సూచన

నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే ఒక రైలుకు ఖాజీపేట(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మే 22 నుంచి 28 వరకు నం.18519 విశాఖపట్నం-ముంబై LTT ఎక్స్‌ప్రెస్ ఖాజీపేటలో ఆగదని, ఖాజీపేట మీదుగా కాక ఈ రైలు గుంటూరు, మౌలాలీ మీదుగా అమ్ముగూడ వెళుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News January 10, 2026
చెరకులో బడ్ చిప్ పద్ధతి వల్ల ప్రయోజనాలు

బడ్ చిప్ పద్ధతిలో పెంచిన చెరకులో సాంద్రపద్ధతి కంటే ఎక్కువ పిలకలు, ఏకరీతిగా ఎదుగుదల ఉండి.. గడల సంఖ్య, గడ బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బడ్ చిప్ మొలకల ద్వారా నీరు, నమయం, కీలక వనరులను ఆదా చేయవచ్చు. ఎక్కువ దూరంలో మొలకలను నాటడం ద్వారా అంతర పంటలు వేసుకొని అదనవు ఆదాయం పొందవచ్చు. బడ్ చిప్ సేద్యంలో యాంత్రీకరణకు సౌకర్యంగా ఉండి, రైతులకు నికర ఆదాయం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.
News January 10, 2026
కోడిపందాలు, పేకాటపై కఠిన చర్యలు: ఎస్పీ నితికా పంత్

సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశామని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సమాచారం డయల్ 100కి ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
News January 10, 2026
ములుగు: మంత్రి నిర్ణయమే ఫైనల్..!

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా పూర్తి స్థాయి కార్యవర్గం లిస్ట్ రెడీ అయ్యింది. ఇప్పటికే అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ ఎన్నికయ్యారు. 36 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేయగా ఉపాధ్యక్షులుగా ముగ్గురు, ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురు, కార్యదర్శులుగా ఐదుగురు, కోశాధికారిగా ఒక్కరు, అధికార ప్రతినిధిగా ఒక్కరు, కార్యవర్గ సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు. మంత్రి సీతక్క ఓకే చెప్పిన వెంటనే ప్రకటించనున్నారు.


