News April 6, 2025
రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
Similar News
News April 9, 2025
బొబ్బిలి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొబ్బిలి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపారు. రెండో ప్లాట్‌ఫామ్‌పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి ఆచూకీని తెలిపే ఎటువంటి ఆధారాలు తమకు దొరకలేదని అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పడితే బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని హెచ్‌సీ ఈశ్వరరావు కోరారు.
News April 9, 2025
VZM: ‘డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమయ్యే డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో గల కస్పా హైస్కూల్ వద్ద ఉన్న ఏపీ బీసీ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.
News April 9, 2025
విజయనగరం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

విజయనగరం జిల్లాలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజల హెల్త్ ప్రొఫైల్‌పై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో క్యాన్సర్ కేసులు 5,968, శ్వాస సంబంధిత కేసులు 4,138, నరాల సంబంధిత కేసులు 6,487 నమోదయ్యాయి. అలాగే జిల్లాలో టీబీ, మలేరియా, డయేరియా, రక్తహీనత, ముందస్తు ప్రసవాలు, పోషకాహార లోపం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సర్వేలో వెల్లడైంది.