News April 6, 2025
కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు

ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలికను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బాలికకు ఇన్స్టాలో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి, మోసం చేశాడు. తీరా ముఖం చాటేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
పత్తికొండ: మీ ఊర్లో నీటి సమస్య ఉందా.. ఫోన్ చేయండి!

పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే తమకు తెలియజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్ ప్రజలను కోరారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, క్రిష్ణగిరి, ఆలూరు, హాళహార్వి, ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ 8520796952కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకు నీటి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
News April 9, 2025
కర్నూలు: ముగిసిన 10th మూల్యాంకనం

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనానికి ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News April 9, 2025
మెప్మా ఉత్పత్తులకు గిన్నిస్ రికార్డు: ఎమ్మిగనూరు కమిషనర్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు వారు తెలిపారు.