News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News April 9, 2025
దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.
News April 9, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: జిల్లా కలెక్టర్

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.
News April 9, 2025
అమరావతిలో పెరిగిన భూముల అమ్మకాలు!

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.