News April 6, 2025
నంద్యాల: మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్కొంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 9, 2025
SMలో మహిళలకు వేధింపులు.. CMకు విజయశాంతి విజ్ఞప్తి

సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ మహిళలకు బాధను, పనిచేయలేని పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహిళలు చేసే కంప్లైంట్‌పై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా అరెస్టులు, ఇతర చర్యలు తీసుకున్నట్లయితే మహిళా లోకానికి ఆత్మస్థైర్యం, విశ్వాసం లభిస్తుంది’ అని సీఎం రేవంత్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు.
News April 9, 2025
పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు.. కీలక నిర్ణయం

AP: పంచాయితీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసింది. MPDO కార్యాలయాల్లోని పంచాయతీ విస్తరణ అధికారుల క్యాడర్‌ను డిప్యూటీ MPDOగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత జగన్ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు MPDO పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేపట్టారని, ఇక నుంచి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.
News April 9, 2025
మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.