News April 6, 2025
7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
Similar News
News April 14, 2025
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా చెరుకువాడ

వైసీపీ పీఏసీ సభ్యులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు దక్కింది. పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
News April 14, 2025
కొవ్వూరు: అప్పు అడిగినందుకు హత్య

ఇటీవల దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఇతని వద్ద పెద్దవం సచివాలయ సర్వేయర్ శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ పలుమార్లు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ కక్ష పెట్టుకుని మరో ఇద్దరి సాయంతో హత్య చేసి కుడి చేతికున్న బంగారం కోసం చేతిని నరికేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.
News April 14, 2025
కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.