News April 6, 2025
కశింకోట: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

కశింకోట మండలం నర్సింగబిల్లిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పి.బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 9, 2025
రేపు ఏపీ, తెలంగాణలో వర్షాలు

రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు తెలంగాణలో రేపు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, HYD, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 9, 2025
దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.
News April 9, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: జిల్లా కలెక్టర్

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.