News April 6, 2025

భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

image

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

Similar News

News February 24, 2026

టీచర్ కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే

image

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET-2026) <>దరఖాస్తుల<<>> ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో 4ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ITEP)లో ప్రవేశాల కోసం NTA ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్ చదువుతున్న/పాసైనవారు అర్హులు. ఏప్రిల్ 17న పరీక్ష ఉంటుంది. ఇంటర్ తర్వాత B.A/BSc/BComతో పాటు B.Ed ఒకేసారి పూర్తి చేసేలా ఈ 4yrs కోర్సును రూపొందించారు.

News February 24, 2026

పల్నాడులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు

image

సత్తెనపల్లిలో విజిలెన్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక వడ్డవల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3,31,060ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకపోవడం, నాసిరకం, నాణ్యత, COTPA చట్టం ఉల్లంఘనపై కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రవణ్ కుమార్ వివరించారు.

News February 24, 2026

వెండి, బంగారు నగలు కలిపి ఉంచితే?

image

చాలామంది బంగారం, వెండి నగలను కలిపి భద్రపరుస్తారు. అయితే ఈ రెండింటినీ కలిపి ఉంచడం సరి కాదంటున్నారు నిపుణులు. వెండి రియాక్టివ్ మెటల్. ఇది ఏదైనా ఇతర లోహంతో కలిసినప్పుడు మూలకాలు ప్రతిస్పందించి చర్య మెుదలవుతుంది. నెమ్మదిగా వెండి ఆభరణాలపై బంగారు పొర ఏర్పడుతుంది. బంగారం నాన్-రియాక్టివ్ మెటల్. అది ఏ లోహంతోనూ స్పందించదు. కానీ క్రమంగా మెరుపు తగ్గుతుంది. కాబట్టి వీటిని విడివిడిగా భద్రపరచాలని సూచిస్తున్నారు.