News April 6, 2025
పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి.
Similar News
News April 9, 2025
కృష్ణా: జోగి రమేశ్‌కు నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన తాడిగడప సీఐడీ కార్యాలయానికి ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సంబంధించి అవసరమైన ఆధారాలను కూడా తీసుకురావాలని ఆదేశించింది.
News April 9, 2025
కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
News April 9, 2025
కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ICDS)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 16 పోస్టుల భర్తీకి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 16 పోస్టులకు 122 మంది దరఖాస్తు చేసుకున్నారు.