News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News April 9, 2025
TG CM రేవంత్‌పై ఏపీ మంత్రి ఫైర్.. కారణమిదే

PM మోదీని TG CM రేవంత్ గాడ్సేతో పోల్చడంపై AP మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘హామీలు అమలు చేయలేని అసమర్థ CM రేవంత్.. తుమ్మితే ఊడిపోయే తన పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఆయనకు అలవాటే. ఆయన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. BJPని అడ్డుకోవడం గాంధీ కుటుంబం వల్లే కాలేదు. ఆ కుటుంబ మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుంది?’ అని ట్వీట్ చేశారు.
News April 9, 2025
కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News April 9, 2025
NTR: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన తాడిగడప సీఐడీ కార్యాలయానికి ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సంబంధించి అవసరమైన ఆధారాలను కూడా తీసుకురావాలని ఆదేశించింది.