News March 26, 2024
‘ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళ్తున్నారు’

BRS నాయకులు పంట నష్టం పై పరిశీలనకు వెళ్లడంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. BRS పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళుతున్నారన్నారు. పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
Similar News
News March 31, 2026
NZB: బైక్‌టైర్‌లో చీరకొంగు చిక్కుకొని మహిళ మృతి

మెండోరా మండలంలోని దూదిగం వద్ద జరిగిన ప్రమాదంలో బస్సాపూర్‌కు చెందిన కమల మరణించారు. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఆమె కట్టుకున్న చీరకొంగు అకస్మాత్తుగా వెనుక టైర్‌లో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన కమల నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.
News March 31, 2026
NZB: స్కౌట్ మాస్టర్ల పోస్టుల భర్తీకై దరఖాస్తుల ఆహ్వానం

NZB జిల్లాలోని మండలాల వారీగా ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ (SGO)లో పనిచేయడానికి స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు SGO జిల్లా కమిషనర్ బానేష్ జాడి తెలిపారు. ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, విద్యుత్ నగర్, కంటేశ్వర్, DS చౌరస్తాలోని నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.
News March 31, 2026
NZB: హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు: CP

హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. సోమవారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. CP పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ACPలు, CIలు పాల్గొన్నారు.


