News April 6, 2025

సీతారాముల కళ్యాణం.. పోటెత్తిన భక్తజనం

image

TG: భద్రాద్రి భక్తజనసంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగునా నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 12గం.లకు రామయ్య, సీతమ్మల కళ్యాణం జరగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో CM రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 9, 2025

YS జగన్‌పై కేంద్రానికి టీడీపీ ఎంపీ ఫిర్యాదు

image

AP: మాజీ సీఎం జగన్ తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని TDP MP లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. పర్యటనల పేరిట విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల నైతికతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరించడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే’ అని లేఖలో పేర్కొన్నారు.

News April 9, 2025

వాహనదారులకు BIG ALERT

image

తెలంగాణలో ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు SEP 30, 2025ని డెడ్‌లైన్‌గా విధించింది. యజమానులు www.siam.in/లో అప్లై చేసుకోవాలని సూచించింది. టూ వీలర్స్ రూ.320-రూ.380, త్రీ వీలర్స్ రూ.350-రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590-రూ.700, కమర్షియల్ వాహనాలకు రూ.600-రూ.800 చెల్లించాలి.

News April 9, 2025

GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

image

IPL: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.

error: Content is protected !!