News April 6, 2025
కొడంగల్‌లో విషాదం.. బాలుడి మృతి

కొడంగల్ మం.లో విషాదం నెలకొంది. ఎనికేపల్లిలో మణితేజ(9) తండ్రి బసంతప్పతో కలిసి ఎద్దులకు నీళ్లు పోసేందుకు నీటితొట్టి వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో గాలికి చెట్టుకొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. ఒక్కసారిగా కరెంటు వైరు మణితేజకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలి: కలెక్టర్ @గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం @ అయ్యప్ప స్వామి నూతన కమిటీ ఏకగ్రీవం @ రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు: ఎస్పీ @గద్వాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
News April 10, 2025
జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లు చేస్తున్నారా?

చాట్‌జీపీటీ జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. చాలా సైట్లు జీబ్లీ ఆర్ట్ డౌన్‌లోడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, దీనివల్ల యూజర్ల డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించాయి. యూజర్ల లోకేషన్, గ్యాలరీ, మెసేజులు, ఫింగర్ ప్రింట్స్ సైతం దొంగిలించి మోసం చేస్తాయని వార్నింగ్ ఇచ్చాయి. వెరిఫైడ్ యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాయి.
News April 10, 2025
భట్టిప్రోలు: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు

మద్యం మత్తులో కన్నతల్లిని కడతేర్చినట్లు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఎస్ఐ ఎం శివయ్య బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన బసవపూర్ణమ్మ(74) పెద్ద కుమారుడు దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం అతను తల్లిని దూషిస్తూ, డబ్బుల కోసం వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో తల్లిని హతమార్చాడన్నారు. వేమూరు సీఐ వీరాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.