News April 6, 2025
మైనర్‌పై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ అరెస్ట్

బెంగళూరులో బాలికపై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ సురేశ్ బాలాజీ అరెస్టయ్యాడు. TNకు చెందిన సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఓ బాలిక(16) రెండేళ్ల క్రితం అందులో చేరగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని చెప్పారు. అతడి ఫోన్‌లో మరో 8మంది న్యూడ్ ఫొటోలు ఉన్నాయన్నారు. మిగతా ట్రైనీలపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News April 10, 2025
లండన్‌లో ఆ హీరోహీరోయిన్ల కాంస్య విగ్రహాలు

భారత సినీ చరిత్రలో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. విడుదలై 30 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ మూవీకి లండన్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. అక్కడి లైసెస్టర్ స్క్వేర్‌లో DDLJ హీరోహీరోయిన్లు షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహాల్ని నెలకొల్పనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలోపు విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
News April 10, 2025
అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ హెచ్చరికలు

అమెరికాలో ప్రయాణిస్తున్న, ప్రయాణించనున్న తమ దేశస్థులకు చైనా హెచ్చరికల్ని జారీ చేసింది. ‘అమెరికా-చైనా బంధం బలహీనపడటం, అమెరికా దేశీయ భద్రత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని USకి ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. అమెరికా, చైనా ప్రస్తుతం తీవ్రస్థాయి సుంకాల యుద్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాల్ని ట్రంప్ ఈరోజు 125శాతానికి పెంచారు.
News April 10, 2025
ALERT: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..?

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.