News April 6, 2025
గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.
Similar News
News July 5, 2025
VKB: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
JGTL: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన పోలీసులు

మంచిర్యాల్ జిల్లా చున్నంబట్టివాడకు చెందిన కొమిరి రజిత కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాల (D) ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చిన రజిత బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు స్పందించి సమయస్ఫూర్తితో అడ్డుకొని ఆమెను కాపాడారు.