News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
Similar News
News April 10, 2025
కంచ గచ్చిబౌలికి నేడు ‘సుప్రీం’ కమిటీ సందర్శన

TG: సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ నేడు కంచ గచ్చిబౌలి భూముల్ని సందర్శించనుంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కమిటీ సభ్యులు తాజ్ కృష్ణలో బసచేశారు. ఈరోజు ఉదయం 10గంటలకు వీరు హెచ్‌సీయూకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వాధికారులతో కమిటీ సమావేశం కానుంది.
News April 10, 2025
IPL: ఈరోజు బెంగళూరుతో ఢిల్లీ ఢీ

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ, ఢిల్లీ తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో డీసీ రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో నేటి పోరు హోరాహోరీగా జరగొచ్చు. డీసీ హ్యాట్రిక్స్ విన్స్‌తో ఉండగా ఆర్సీబీ ఓడుతూ, గెలుస్తూ వస్తోంది. ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.
News April 10, 2025
రాజీవ్ యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

TG: నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 9.5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14న తుదిగడువు కాగా ఆలోపు దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు.