News April 6, 2025

కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

image

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్‌పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 15, 2025

స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

News September 15, 2025

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.