News April 6, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.
Similar News
News April 11, 2025
బీజేపీలోకి విజయసాయి రెడ్డి?

AP: YSRCP, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నానని ప్రకటించిన మాజీ MP విజయసాయి రెడ్డి BJP తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ వినిపించినా.. ఫైనల్‌గా బీజేపీయే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం. MPగా పెద్దల సభకు పంపిచేందుకు కమలనాథులూ ఓకే అన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
News April 11, 2025
2, 3 రోజుల్లో ఇంటర్ ఫలితాలు

AP: ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 3 నాటికే మూల్యాంకనం పూర్తవడంతో హాల్ టికెట్ల నంబర్ల ఆధారంగా మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. 2, 3 రోజుల్లోనే ఫలితాలను రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. bieap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News April 11, 2025
మాయావతి మేనకోడలికి కట్నం వేధింపులు

భర్త, అత్తింటి వారిపై BSP అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్నం కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. UPలోని హాపూర్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ పుష్పా దేవి కుమారుడు విశాల్ సింగ్‌ను బాధితురాలు 2023లో పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ అనంతరం పుష్పా దేవిని, ఆమె కుటుంబీకుల్ని BSP వెంటనే పార్టీ నుంచి తప్పించింది.