News April 6, 2025

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.

Similar News

News April 11, 2025

రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు 61 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, పెదపారుపూడి, ఉంగుటూరు, ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. ఇవాళ అత్యధికంగా వైఎస్సార్(D) అట్లూరులో 41.4°C, ప్రకాశం(D) గుంటుపల్లిలో 41.2°C ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపింది. వడగాలులు వీచే మండలాల లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 11, 2025

అసలేంటీ కోనోకార్పస్ చెట్లు? ఎందుకింత చర్చ?

image

కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు INDకు తెచ్చారు. చూడటానికి గుబురుగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ చెట్లు <<16065381>>పర్యావరణ<<>>, ఆరోగ్య సమస్యలకు కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వేర్లు లోతుగా వెళ్లి తాగునీరు వ్యవస్థలు, భవనాలను సైతం దెబ్బతీస్తాయంటున్నారు. ఈ చెట్లు అందం కోసం తప్పితే మరెందుకూ పనికిరావనేది వారి వాదన.

News April 11, 2025

ఇంటర్ రిజల్ట్స్ భయం.. విద్యార్థి ఆత్మహత్య

image

AP: నంద్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18) ఇటీవల ఫస్టియర్ ఎగ్జామ్స్ రాశాడు. రేపు ఫలితాలు రానుండగా, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
☛ పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. మళ్లీ కష్టపడి చదివి పాసయ్యేందుకు ప్రయత్నించాలి.

error: Content is protected !!