News April 6, 2025

సికింద్రాబాద్: రైలులోని వాష్‌రూమ్‌లో అత్యాచారం (UPDATE)

image

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్‌రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్‌(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్‌ కోరారు.

Similar News

News April 11, 2025

పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

image

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

News April 11, 2025

BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

image

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.

News April 11, 2025

అపార్ట్ కార్డుల నమోదులో మొదటి స్థానంలో జగిత్యాల

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే అపార్ కార్డుల నమోదులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1096 పాఠశాలలు ఉండగా.. 1,61,822 మంది విద్యార్థులు ఉన్నారు. అపార్ కార్డుల నమోదులో 88.73 శాతం చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా విద్యాధికారి రామును ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.

error: Content is protected !!