News March 26, 2024
10 నిమిషాల వీడియో కాల్‌తో వందల ఉద్యోగాలు కట్!

కెనడాకు చెందిన టెలికాం దిగ్గజం బెల్ 10 నిమిషాల వీడియో కాల్ మీటింగ్స్ నిర్వహించి 400 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. 4,800 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు గతనెల ప్రకటించిన నేపథ్యంలో ఈ కోత విధించడం గమనార్హం. కాగా ఈ చర్యను అక్కడి ప్రైవేట్ సెక్టార్ యూనియన్ యూనిఫర్ ఖండించింది. ముందస్తు సమాచారం లేకుండా కోత విధించడాన్ని తప్పుపట్టింది. అయితే ఉద్యోగులకు ముందే సమాచారం ఇచ్చినట్టు బెల్ పేర్కొంటోంది.
Similar News
News January 23, 2026
ఒక్క బంతికే 11 రన్స్

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.
News January 23, 2026
భర్తను చంపిన భార్య.. కీలక విషయాలు

AP: గుంటూరు(D) దుగ్గిరాలలో భర్తను భార్య చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన <<18921625>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగరాజే తనకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేశాడని విచారణలో భార్య మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన బిడ్డ అలా చేసుండదని, ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారని మాధురి తల్లి బీబీసీ వద్ద వాపోయారు. కాగా ప్రియుడు గోపీతో కలిసి భర్త నాగరాజును మాధురి హత్య చేసినట్లు కేసు నమోదైంది.
News January 23, 2026
ఈ నెల 27న ‘జన నాయగన్’పై తుది తీర్పు

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు ఈ నెల 27న తుది తీర్పు ఇవ్వనుంది. ఇటీవల కోర్టు తీర్పును <<18907956>>రిజర్వ్<<>> చేసిన విషయం తెలిసిందే. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ CBFC అప్పీల్ దాఖలు చేయడంతో వివాదం చెలరేగింది. డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూవీ విజయ్ చివరి సినిమా కావడం గమనార్హం.


