News April 6, 2025
తాడేపల్లి: 8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

తాడేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సదా శివరావుగా గుర్తించారు. ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2025
గుంటూరు: విశాట్-2025 ఫేజ్-1 ఫలితాలు విడుదల

విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ ఏడాది విశాట్-2025 ఫేజ్-1కు విశేష స్పందన లభించిందని తెలిపింది. శనివారం విడుదలైన ఫలితాలు విద్యార్థుల్ని ఉత్సాహపరిచాయి. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వైస్ ఛాన్సలర్ నాగభూషణ్ వెల్లడించారు. అలాగే, ఫేజ్-2 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 13 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో విజ్ఞాన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ చూపారు. శనివారం సాయంత్రం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషితో పాటు అధ్యాపకుల సహకారమే ఈ విజయానికి కారణమన్నారు. అధినేత లావు రత్తయ్య ఫలితాలపై ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
News April 13, 2025
దుగ్గిరాల: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

దుగ్గిరాల (M) చినపాలెంలో శనివారం జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. ఓ జూనియర్ కాలేజీలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్ (17) ఇంటర్ పరీక్షల్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫలితాలు వెలువడిన వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అవినాశ్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.