News April 6, 2025

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News April 7, 2025

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: గంట రవికుమార్

image

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సోమవారం శివనగర్‌లో ఓ రేషన్ షాపు వద్ద నరేంద్ర మోదీ ఫొటో పెట్టి మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలు ఇస్తుంటే.. మొత్తం తామే ఇస్తున్నట్టు కాంగ్రెస్ గప్పాలు కొడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉన్నారు.

News April 7, 2025

వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

News April 7, 2025

వరంగల్: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

image

వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

error: Content is protected !!