News April 6, 2025
వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.
Similar News
News April 7, 2025
28 ఏళ్లుగా నో యాక్టింగ్..అయినా రిచ్చెస్ట్ పర్సన్

వ్యాపార వేత్తగా సక్సెస్ సాధించిన మెకాలే కుల్కిన్ మూడేళ్ల వయసులోనే టీవీషోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1992లో వచ్చిన మైటీ డక్స్ మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లోనే నటనకు వీడ్కోలు పలికి వ్యాపారం ప్రారంభించారు. ఇంటర్నెట్ గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్థాపించి సక్సెస్ సాధించారు. నటనకు వీడ్కోలు పలికినప్పటికీ సినిమా ఫీల్డ్‌లో మెకాలేనే రిచ్చెస్ట్ యాక్టర్‌గా భావిస్తారు.
News April 7, 2025
IPL.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

IPLలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. T20ల్లో 13,000 రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. బౌల్ట్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో ఈ ఘనతను అందుకున్నారు. 386 ఇన్నింగ్సుల్లో విరాట్ ఈ రికార్డును సాధించగా, అతని కంటే ముందు పొలార్డ్(13,537), షోయబ్ మాలిక్(13557), హేల్స్(13,610) ఉన్నారు. టాప్‌లో గేల్(381 ఇన్నింగ్సుల్లో 14,562 రన్స్) ఉన్నారు.
News April 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.