News April 6, 2025
మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్

AP: మాజీ Dy.CM అంజద్ బాషా సోదరుడు అహ్మద్ అరెస్టయ్యారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. TDP MLA మాధవీరెడ్డిని దూషించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలోనూ దాడి కేసు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరువర్గాలు రాజీ పడినప్పటికీ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేసినట్లు YCP వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Similar News
News April 8, 2025
IPL: పోరాడి ఓడిన ముంబై

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్‌వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.
News April 8, 2025
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో రా.9.35కు ట్రైన్ బయలు దేరనుండగా.. శని, సోమ వారాల్లో సా.4.35కు తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు వెళ్లనుంది. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
News April 8, 2025
పడుకునే ముందు వీటిని తింటున్నారా?

రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్‌తో చేసే శాండ్ విచ్, పిజ్జా తింటే కడుపులో మంట పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిర్యానీ, స్వీట్లు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు తినకూడదు. కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. రాత్రి ఆహారం 7 గంటలలోపు తినడం ఉత్తమం.