News April 6, 2025

కాళేశ్వరంలో 20 అడుగుల విగ్రహంతో వైభవం

image

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయశాఖ, ఇతర విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా తయారుచేయించి తెప్పిస్తున్నారు. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ముహుర్తం నిర్ణయించారు.

Similar News

News April 7, 2025

రాత్రి నిద్రలో ఇలా అనిపిస్తోందా?

image

రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొందరిలో పాదాలలో జలదరింపు, తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నోరు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగాయనే దానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. వీరిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వ్యక్తులు ఆహారపు అలవాట్లతోపాటు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

News April 7, 2025

ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించిన ఆకునూరి

image

ఒంటిమామిడిపల్లి పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విద్యార్థులను ఛైర్మన్ పలు అంశాల్లో ప్రశ్నించి వారి ప్రతిభా పాటవాలను మెచ్చుకున్నారు. తరగతి గదులు, ప్రీ ప్రైమరీ ప్లే టూల్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

News April 7, 2025

నంద్యాల జిల్లాలో టుడే TOP NEWS

image

☞ దొర్నిపాడు ఎస్‌ఐగా సత్యనారాయణ బాధ్యతలు ☞ రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి: మంత్రి బీసీ☞ PGRSకు 220 దరఖాస్తులు: కలెక్టర్☞ వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్☞ బండి ఆత్మకూరు ఎస్ఐ, వ్యవసాయ అధికారి ఎస్‌ఐ, తీవ్ర వాగ్వాదం ☞ ఆళ్లగడ్డ సీఐగా యుగంధర్ బాధ్యతలు ☞ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది రవ్వలకొండలోనే..! ☞ ఆదోని: పెద్ద హరివాణంలో INSTAGRAMలో ప్రేమ.. పెళ్లి

error: Content is protected !!