News April 6, 2025
జగన్‌ను మించి అప్పులు చేస్తున్న కూటమి: రామకృష్ణ

AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.
Similar News
News April 7, 2025
బిగ్‌బాస్ సీజన్-9కు బాలయ్య హోస్ట్?

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. తొమ్మిదో సీజన్‌కు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News April 7, 2025
ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

TG: SIB మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచిలో SOT అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది ప్రభాకర్ రావే అన్నారు. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా SOT పనిచేసిందన్నారు. ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందిన వ్యక్తి కూడా చట్టపరమైన దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
News April 7, 2025
రాత్రి నిద్రలో ఇలా అనిపిస్తోందా?

రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొందరిలో పాదాలలో జలదరింపు, తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నోరు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగాయనే దానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. వీరిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వ్యక్తులు ఆహారపు అలవాట్లతోపాటు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.