News April 6, 2025
8న అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్?

పుష్ప-2 తర్వాత రెస్ట్ మోడ్‌లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఎల్లుండి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. నిర్మాత బన్నీ వాస్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘APR 8న షాకింగ్ సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొనడంతో ఐకాన్ స్టార్- అట్లీ మూవీ గురించేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ రోజు టెక్నీషియన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
Similar News
News April 7, 2025
రాత్రి నిద్రలో ఇలా అనిపిస్తోందా?

రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొందరిలో పాదాలలో జలదరింపు, తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నోరు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగాయనే దానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. వీరిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వ్యక్తులు ఆహారపు అలవాట్లతోపాటు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.
News April 7, 2025
చితక్కొట్టిన ఆర్సీబీ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 221/5 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ పాటిదార్ (64), విరాట్ కోహ్లీ (67), పడిక్కల్ (37), జితేశ్ శర్మ (40) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ధాటికి ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పాండ్య , బౌల్ట్ చెరో 2 వికెట్లు తీశారు. ముంబై విజయ లక్ష్యం 222.
News April 7, 2025
ఆదాయం లేకుండా GDP ఎలా పెరిగింది బాబూ: బొత్స

AP: అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆదాయమే లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుందని నిలదీశారు. ‘కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో ఉన్న చెత్త తీయించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.