News April 6, 2025

విషాదం.. నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

image

AP: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అవనిగడ్డ మండలం కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు చనిపోయారు. మృతులను మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15)గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News April 18, 2025

మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

image

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

News April 18, 2025

జాట్ మూవీ టీంపై కేసు నమోదు

image

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

News April 18, 2025

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్‌పూర్‌కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.

error: Content is protected !!