News April 6, 2025
నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News April 7, 2025
NLG: యాక్సిడెంట్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్ మృతి

నిడమనూరు మండలం గుంటిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కారు డ్రైవర్ నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 7, 2025
NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
News April 7, 2025
నేరేడుగొమ్ము: పురుగు మందు తాగి ఒకరి సూసైడ్

ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిపల్లి ఎస్ఐ మేరకు.. నేరేడుగొమ్ము మండలం చిన్నమునిగల్‌కి చెందిన అరవింద్(27) అప్పులు బాధతో పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో పురుగు మందు తాగాడు. అనంతరం భార్యకు వీడియో కాల్ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యలు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.