News April 6, 2025
పాపిరెడ్డి గ్రామానికి రానున్న వైఎస్ జగన్.. రూట్‌మ్యాప్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8న రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో సీకే పల్లి చేరుకుంటారు. 10:50కి సీకే పల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు పాపిరెడ్డి గ్రామానికి చేరుకుంటారు. 11.10 వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30కి బెంగళూరుకి తిరుగు పయనమవుతారు.
Similar News
News November 11, 2025
అందెశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు

ప్రజా కవి, రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నివాళులు అర్పించి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సాహిత్య లోకానికి అందెశ్రీ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. కాగా, ఘట్కేసర్‌లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
News November 11, 2025
వెల్దండలో పెరిగిన చలి తీవ్రత..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. వెల్దండ మండల కేంద్రంలో గడచిన 24 గంటలలో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిజినేపల్లి 16.3, ఊర్కొండ, సిర్సనగండ్ల 16.6, పదర, తెలకపల్లి 16.8, యంగంపల్లి, బోలంపల్లి 16.9, కుమ్మెర 17.0, అమ్రాబాద్17.1, తోటపల్లి, ఎల్లికల్ 17.4, ఐనోల్ 17.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 11, 2025
ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్‌లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్‌కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్‌తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!


