News April 6, 2025
యువతికి కత్తిపోట్లు.. నిందితుడి అరెస్ట్

AP: విజయనగరం జిల్లా శివరాంలో అఖిల అనే యువతిపై <<16001435>>కత్తితో దాడి చేసిన<<>> వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇవాళ స్పృహలోకి వచ్చి వివరాలు చెప్పడంతో ఆదినారాయణ(21)ను అదుపులోకి తీసుకున్నారు. ‘అఖిల సోదరుడికి ఆది స్నేహితుడు. ఇటీవల ఆమెకు నిందితుడు అసభ్య సందేశాలు పంపాడు. దీంతో అఖిల కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. కక్ష పెంచుకుని ఆదినారాయణ దాడి చేశాడు’ అని పోలీసులు తెలిపారు.
Similar News
News November 6, 2025
వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.
News November 6, 2025
ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.
News November 6, 2025
రికార్డులు బద్దలు.. బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బిహారీలు రికార్డులు బద్దలుకొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇవాళ జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఏకంగా 64.66శాతం ఓటింగ్ నమోదైంది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 64.6శాతమే ఇప్పటివరకు అత్యధికం. గత ఎలక్షన్స్(2020)లో 57.29శాతం పోలింగ్ రికార్డవగా ఈసారి 7శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.


