News April 6, 2025
ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యలపై ఉ.9 గంటల నుంచి మ.1గంట వరకు వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం

హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా.నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
News April 17, 2025
ఈ సమ్మర్లో ఎటు ప్లాన్ చేస్తున్నారు?

వేసవి సెలవుల్లో పిల్లలను పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.
News April 17, 2025
కియాలో ఇంజిన్ల చోరీ.. 8 మంది అరెస్ట్

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి లభించింది. తమిళనాడుకు చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్ జైలుకు తరలించారు. వారిని విచారించిన తర్వాత మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.