News April 6, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో MLA కోమటిరెడ్డి భోజనం

చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పంతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు భోజనం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2025
వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?

వేసవి సెలవుల్లో పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, యాగంటి, ఎల్లార్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వర ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.
News April 17, 2025
కడప: 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య?

కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాశ్‌కు చెందిన సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కి వెళ్ళి చొక్కా గ్రిల్‌కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 17, 2025
జగిత్యాల కోట గురించి మీకు తెలుసా…?

ఎల్గందుల కోటకు అధిపతిగా ఉన్న మారుమల్ల ముల్క్ జాఫరుద్దౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధింసా క్రీ.శ.1747లో జగిత్యాలలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాంకేతిక సహకారంతో నిర్మించారు. జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రం ఆకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది నిర్మించి దాదాపు 250ఏళ్లు కావొస్తుంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.